ముకుందకి తేల్చి చెప్పేసిన మురారి.. అసలు నిజం తెలియనుందా?
on Sep 20, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -266 లో.. ముకుంద ఇంటి బాధ్యతలు తీసుకొని వంట చేస్తుంది. అందరూ భోజనం చెయ్యడానికి వస్తారు. ఏం వంటలు చేశావని ప్రసాద్ ముకుందని అడుగుతాడు. నేను చెప్తానంటూ కృష్ణ చూసి చెప్తుంటే.. వద్దు చూడకుండా స్మెల్ చూసి చెప్పమని ముకుంద అనగానే.. కృష్ణ వాసన చూసి కరెక్ట్ గా చెప్పేస్తుంది.
ఆ తర్వాత మురారికి ముకుంద దగ్గర ఉండి భోజనం వడ్డీస్తుంది. ఏంటి అన్ని మురారికి ఇష్టమైనవి చేశావా? నీకేమీ ఇష్టమో తెలుసా అని కృష్ణ అనగానే... ఇష్టమైన వాళ్ళ గురించి అన్ని ఇష్టంగా తెలుసుకోవాలి అనగానే అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ముకుంద కవర్ చేస్తూ.. నా భర్త ప్రాణ స్నేహితుడు కదా అంటూ కవర్ చేస్తుంది. ఇంకా ఏం ఇష్టమని కృష్ణ అనగానే.. ముకుంద వరుసగా చెప్తుంటుంది. ఒక్కసారిగా మురారికి దగ్గు వస్తుంది. ముకుంద, మురారీ ఇద్దరు ఒకేసారి మురారికి వాటర్ ఇస్తారు. అది చూసిన రేవతి.. ఏంటి ముకుంద, కృష్ణ అక్కడే ఉంది కదా చూసుకుంటుంది కదా? నువ్వు ఎందుకు ఇస్తున్నావంటూ కోప్పడుతుంది. నేనే వడ్డీస్తున్న కదా అందుకే ఇచ్చానని ముకుంద అంటుంది.. ఆ తర్వాత మురారి దగ్గర నుండి ముకుందని పంపించాలని కృష్ణ ట్రై చేసినా కూడా ముకుంద వెళ్లకుండా మురారి పక్కనే ఉంటుంది. ఆ తర్వాత కృష్ణ తన గదిలోకీ వెళ్లి.. తను నా భర్తకి వడ్డీస్తుంటే నేనెందుకు ఉన్నాను అసలు.. ఈ ఇంట్లో నా స్థానమేంటి అని కృష్ణ అనుకొని బాధపడుతుంది. అప్పుడే అటుగా వెళ్తున్న మధు.. కృష్ణ దగ్గరికి వచ్చి వీడియో చేద్దామా అని అడుగుతాడు. నాకు ఇంట్రెస్ట్ లేదని కృష్ణ చెప్తుంది. అయిన మధు అలాగే అడిగేసరికి కృష్ణకి కోపం వచ్చి మధుపై అరుస్తుంది. ఏంటి ముకుంద ఏమైన వార్నింగ్ ఇచ్చిందా అని మధు అడుగుతాడు. కృష్ణ ఆశ్చర్యంగా చూడడంతో నాకు అంత తెలుసు. నీక్కూడా చెప్తానని మధు అంటాడు.
మరొక వైపు మధుపై కృష్ణ అరవడం చూసిన మురారి అసలు కృష్ణకి ఏమైందని అనుకుంటాడు. అప్పుడే మురారికి ముకుంద ఫోన్ చేస్తుంది. మురారి చిరాకుపడుతు.. నాకు ఈ టార్చర్ ఏంటి? నీ సంగతి చెప్తాను అనుకొని వస్తూన్నా నీతో మాట్లాడాలని ముకుందకి మురారి చెప్తాడు. మరొక వైపు కృష్ణకి మురారి, ముకుందల ప్రేమ గురించి, ముకుంద చేసే పనుల గురించి మధు చెప్తాడు. అత్తయ్య లాగే నేను బాధపడకూడదని మధు అలా చెప్తున్నాడెమో అని కృష్ణ అనుకొని.. ఏదైనా నా కళ్లతో చూడనిదే నేను నమ్మనని కృష్ణ మనసులో అనుకుంటుంది. మరొక వైపు ముకుందపై మురారి కోప్పడతాడు. వాళ్ళు మాట్లాడుకునేది కృష్ణ చాటుగా వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read